Zubeen Garg | అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు జుబీన్ మృతిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది.
జుబీన్కు విషమిచ్చి (Poisoned) ఉంటారని ఆయన బ్యాండ్మేట్ (Zubeen Gargs Bandmate) శేఖర్ జ్యోతి గోస్వామి (Shekhar Jyoti Goswami) అనుమానం వ్యక్తం చేశారు. గాయకుడి మేనేజర్ సిద్ధార్థశర్మ (Siddharth Sharma), ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్కాను (Shyamkanu Mahanta) ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. దీంతో జ్యోతి గోస్వామి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దర్యాప్తు అధికారులు ఈ కేసులో పలువురు సాక్ష్యులను విచారిస్తున్న విషయం తెలిసిందే.
శేఖర్ జ్యోతి గోస్వామి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జుబీన్కు విషమిచ్చి ఉంటారని ఆమె ఆరోపణలు చేశారు. సింగపూర్లో జుబీన్తో కలిసి సిద్ధార్థ్ ఒకే హోటల్లో బస చేసినట్లు చెప్పారు. గాయకుడి మృతి తర్వాత మేనేజర్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందన్నారు. ‘జుబీన్ గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్. నాతోసహా ఎంతోమందికి ఆయన శిక్షణ ఇచ్చారు. అలాంటి ఆయన ఈత కొడుతూ మునిగిపోయే ఆస్కారమే లేదు. ఆయన మృతి వెనుక కుట్ర దాగి ఉంది. ఆయనకు విషమిచ్చి ఉంటారు. జుబీన్ మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజరే ఆ కుట్రకు పాల్పడి ఉంటారు’ అని ఆమె విచారణ సందర్భంగా తెలిపారు.
52 ఏండ్ల సింగర్ జుబీన్ గార్గ్ గత నెల 19న సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సింగర్ మృతిపై సీఎం హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు. డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది.
ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే జుబీన్ మేనేజర్ సిద్ధార్థశర్మ ఇంట్లో సోదాలు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. మూడు రోజుల క్రితం ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనతోపాటూ నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంతను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక గతవారం మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని కూడా దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పలువురు సాక్ష్యులను కూడా విచారిస్తున్నారు.
Also Read..
“Zubeen garg | జుబీన్ గార్గ్ మృతి కేసులో కొత్త మలుపులు ..ఇద్దరి అరెస్ట్, భార్య గరిమ సంచలన ఆరోపణలు”
“Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు సన్నిహితులు అరెస్ట్”
“Zubeen Garg | సింగర్ మరణంపై అనుమానాలు.. జుబీన్ మేనేజర్ అరెస్ట్”