భువనేశ్వర్: మతి స్థితిమతం లేని మహిళలను ఓ లారీ డ్రైవర్ (Truck Driver) ఎత్తుకెళ్లిన (Kidnapped) ఘటన ఒడిశాలోని భ్రదక్ పట్టణంలో చోటుచేసుకున్నది. గురువారం అర్ధరాత్రి సమయంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై భద్రక్ పట్టణంలోని ఓ దుకాణం వరండాలో ఒక మతి స్థితిమితం లేని మహిళ ఉన్నది. ఆ షాప్ ముందు నుంచి వెళ్తున్న లారీ డ్రైవర్ ఒంటరిగా ఉన్న ఆమెను గమణించాడు. కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత లారీ ఆపిన అతడు.. తిరిగి రివర్స్‌లో వెనక్కి వచ్చాడు. ఒక్క ఉదుటున లారీలో నుంచి కిందిక దిగి ఆమెవైపు పరుగు ప్రారంభించాడు.
తనకు ఏదో ఆపద ముంచుకొస్తున్నదని గ్రహించిన బాధితురాలు ఓ కవర్లో ఉన్న తన వస్తువులను తీసుకుని ఆ వరండాలో పరుగు ప్రారంభించింది. అయితే ఆమెను అడ్డగించిన ట్రక్ డ్రైవర్, హైవేపై హెడ్ లైట్ల వెలుతురు పోయేవరకు ఆమెను పిల్లర్‌కు అదమి పట్టుకున్నాడు. కేకలు వేస్తున్నప్పటికీ ఆమెను అమాంతం ఎత్తుకుని తన లారీలోకి ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే సీసీ కెమెరాకు కొంచెం దూరంలో ఉండటంతో నిందితుని మొహం స్పష్టంగా కనిపించడం లేదు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. హైవేపై ఉన్న కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతనిని పట్టుకోవడం అంత కష్టమేమీ కాదని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
#ମହିଳାଙ୍କୁ_ଉଠାଇନେଲା_ଟ୍ରକ_ଡ୍ରାଇଭର୍
ରାସ୍ତାକଡ଼ରୁ ମହିଳାଙ୍କୁ ଟେକି ନେଲା ଟ୍ରକ ଡ୍ରାଇଭର୍ । ଭଦ୍ରକ, ଚରମ୍ପାର ରିଜର୍ଭ ପୋଲିସ ଲାଇନ ପାଖରୁ ଜଣେ ମହିଳାଙ୍କୁ ଟ୍ରକ ଡ୍ରାଇଭର୍ ଅପହରଣ କରି ନେଇଛି ।#Bhadrak #WomenSafety #CCTVFootage # #OTV pic.twitter.com/ENZ000R4ul— ଓଟିଭି (@otvkhabar) October 3, 2025