హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ టీచింగ్ స్టాఫ్‌ను వెంటనే భర్తీ చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని కోరింది.