హైదారాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : బలిమెల రిజర్వాయర్‌లో మావోయిస్టులు దాడి చేసి 38 మందిని హత్యచేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యం త్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలను మంగళవారం తన కార్యాలయంలో డీజీపీ అందజేశారు.
2008 జూన్ 29న మావోయిస్టుల ఆకస్మిక దాడిలో 32 మంది గ్రేహౌండ్స్ విభాగపు జవాన్లు సహా మొత్తం 38 మంది మరణించారని తెలిపారు. వారి వారసులకు హైదరాబాద్ శివారులో 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ 2013లో జీవో నంబర్ 339 జారీచేసింది. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ ఏడీజీ అనిల్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్‌కుమార్, ఐజీ బీ సుమతి, కమాండర్ రాఘవేందర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.