Superstar Rajinikanth | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజినీకాంత్ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన సినీ ప్రయాణం ప్రారంభమై ఆగస్టు 15 నాటికి సరిగ్గా 51 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1975లో ఇదే రోజున విడుదలైన ‘అపూర్వ రాగాలు’ సినిమా ద్వారా ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు దశాబ్దాలకు పైగా తనదైన శైలిలో నటిస్తూ అసాధారణమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
అయితే ఈ స్పెషల్ మూమెంట్‌ని ఆయన తన తదుపరి చిత్రమైన ‘ధర్మన్’ షూటింగ్ సెట్స్‌లో ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి సూపర్‌స్టార్‌ను సత్కరించారు. “51 సంవత్సరాలు. ఒకే పేరు. ఒకే సూపర్‌స్టార్” అంటూ చిత్ర బృందం ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ధర్మన్’ చిత్రం రజినీకాంత్ కెరీర్లో 173వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.