ముంబై: అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. (Air India plane crash) దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనీష్ కామ్దార్ కుమార్తె అయిన 32 ఏళ్ల యషా కామ్దార్కు గుజరాత్‌లోని మోధా కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. దీంతో పెళ్లి నాటి నుంచి నాలుగేళ్లుగా ఆమె అహ్మదాబాద్‌లో నివసిస్తున్నది.
కాగా, యషా మామ కిషోర్ మోధా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇటీవల అహ్మదాబాద్‌లో మరణించారు. చికిత్స కోసం ఆయన భారత్‌కు తిరిగి రాక ముందు చాలా కాలం లండన్‌లో నివసించారు. ఈ నేపథ్యంలో లండన్‌లో కిషోర్ మోధా అంత్యక్రియల కోసం యషా, ఆమె ఏడాదిన్నర కుమారుడు రుద్ర, 58 ఏళ్ల అత్త రక్షా మోధా గురువారం ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు. అయితే విమాన ప్రమాదంలో ఈ ముగ్గురు మరణించారు. యషా భర్త కొన్ని రోజుల తర్వాత లండన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడంతో ఈ విమానంలో ఆయన ప్రయాణించలేదు.
మరోవైపు యషా మరణవార్త తెలిసిన వెంటనే నాగ్‌పూర్‌లోని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి నాగ్‌పూర్‌లోని కామ్దార్ కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
Also Read:
విమాన శిథిలాల నుంచి.. డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్
విమాన ప్రమాద బాధితుల కోసం.. 300 మందికిపైగా సైనికులు రక్తదానం
బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్ చేసేందుకు కేంద్రం యోచన