న్యూఢిల్లీ: బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశమ్నుట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. (Ground Boeing 787-8 Fleet) పాత కాలం నాటి బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే విషయంలో భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ, ఆపరేటింగ్ విధానాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వివరించాయి.
కాగా, గురువారం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం కొన్ని క్షణాల్లోనే ఎత్తు కోల్పోయి కూలిపోయి పేలిపోయింది. భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read:
ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు
విమానం కూలిన వెంటనే 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు.. పక్షులు, శునకాలు కూడా తప్పించుకోలేవు
బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా