అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా విమానం ప్రమాద బాధితులకు సహాయం కోసం ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. 300 మందికిపైగా సైనికులు రక్త దానం చేశారు. అహ్మదాబాద్‌లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర్మీ ప్రారంభించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) అందులో ఉన్న 241 మందితో పాటు పలువురు మెడికల్ స్టూడెంట్స్, స్థానికులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు.
కాగా, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన రక్తాన్ని సమకూర్చేందుకు ఆర్మీ ముందుకు వచ్చింది. అహ్మదాబాద్‌లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర్మీ ప్రారంభించింది. 300 మందికిపైగా ఆర్మీ జవాన్లతోపాటు అధికారులు రక్త దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. స్థానిక ఆసుపత్రులు, సేవా సంస్థల సమన్వయంతో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేపట్టారు.
Around 300 Army personnel are donating blood for the survivors.#planecrash #AirIndia pic.twitter.com/ZDT14F72xd
— Akash Sharma (@kaidensharmaa) June 13, 2025
Also Read:
విమాన శిథిలాల నుంచి.. డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్
ఎయిర్ ఇండియా ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 10 మందికిపైగా మృతి.. వీరిలో ఏడుగురు సిబ్బంది
బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్ చేసేందుకు కేంద్రం యోచన