అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం (Air India plane crash) శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఇది ఒక డీవీఆర్. దీనిని మేం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఇక్కడికి వస్తుంది’ అని ఏటీఎస్ అధికారి మీడియాతో అన్నారు. అయితే విమాన శిథిలాల్లో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను పరిశీలించిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశమున్నది.
కాగా, గురువారం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం కొన్ని క్షణాల్లోనే ఎత్తు కోల్పోయి మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కూలిపోయి పేలిపోయింది. భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
#WATCH | Gujarat ATS recovered a Digital Video Recorder (DVR) from the debris of the Air India plane that crashed yesterday in Ahmedabad.
An ATS personnel says, “It’s a DVR, which we have recovered from the debris. The FSL team will come here soon.” pic.twitter.com/zZg9L4kptY
— ANI (@ANI) June 13, 2025
Also Read:
బోయింగ్ 787-8 విమానాలను గ్రౌండింగ్ చేసేందుకు కేంద్రం యోచన
భార్య చివరి కోరికను తీర్చేందుకు వచ్చి.. తిరిగిరానిలోకాలకు.. అనాథలైన పిల్లలు
ఐదుగురి మృతదేహాలను గుర్తించిన అధికారులు.. కుటుంబ సభ్యులకు అప్పగింత