58 hospitalised | రోడ్డు పక్కన అమ్మే చిరుతిండి తిని.. 27 మంది పిల్లలతో సహా 58 మంది ఆసుపత్రిపాలు
58 hospitalised | రోడ్డు పక్కన అమ్మే చిరుతిండి తిని 27 మంది పిల్లలతో సహా 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం మూడు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భువనేశ్వర్: రోడ్డు పక్కన అమ్మే చిరుతిండి తిని 27 మంది పిల్లలతో సహా 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం మూడు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. (58 hospitalised) ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం పటాపూర్ గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలు స్థానిక విక్రేత వద్ద ‘కటక్ దహిబారా’ తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు.
కాగా, అనారోగ్యం చెందిన 27 మంది పిల్లలు, 31 మంది పెద్దలను దశరథపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జాజ్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత 21 మంది డిశ్చార్జ్ అయ్యారని జాజ్పూర్ జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కర్ తెలిపారు.
మరోవైపు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చేరిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణకు మూడు స్వతంత్ర బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.
Also Read:
Bengal Repoll | బెంగాల్లోని 285 పోలింగ్ కేంద్రాల్లో 21న రీపోలింగ్, 24న కౌంటింగ్.. ఎందుకంటే?
Boy Killed For Plucking Watermelons | సొంత పొలంలో పుచ్చకాయలు కోసిన బాలుడు.. హత్య చేసిన కౌలుదారులు
siblings found murdered | ఇటుకలతో కొట్టి నలుగురు పిల్లల దారుణ హత్య.. పరారీలో తల్లి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Children
- eating
- Hospitalised
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

