రేపు ఐఐఎం జమ్ము స్నాతకోత్సవం.. 19 మందికి కరోనా
ఐఐఎం జమ్ము | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా ఉన్నారు.

శ్రీనగర్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా ఉన్నారు. ఐఐటీలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో మొత్తం 180 మందికి పరీక్షలు చేయించామని అధికారులు తెలిపారు. వారిలో 19 మంది పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఈనెల 9న కాన్వకేషన్ సెంటర్లో జరగనున్న ఐఐటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనాల్సి ఉన్నది. కాగా, కరోనా కేసులు వచ్చినప్పటికీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఎల్జీ మనోజ్ సిన్హా కూడా హాజరవుతారని తెలిపారు.
దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో 1,26,789 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 685 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనాల మరణాల సంఖ్య 1,66,862కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజీలాండ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్‌లోని న్యూజిలాండ్ పౌరులకు కూడా ఇది వర్తిస్తుందని ఆదేశ ప్రధాని జెసిండా అర్డెర్న్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
‘బ్లూ’టీ తాగండి..‘యవ్వనం’గా ఉండండి
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
మోనాల్‌కు ముద్దిచ్చిన డ్యాన్స్ మాస్టర్- వీడియో
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
కేసుల కలకలం : లాక్డౌన్ దిశగా జర్మనీ!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

