బిగ్ బాస్ షోకు ముందు పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోని మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ తర్వాత మోనాల్ లైఫ్ పూర్తిగా మారింది. ఆమెకు పలు సినిమాలు, టీవీ ఆఫర్స్ రావడమే కాక నిత్యం ఏదో ఒక విషయంతో హెడ్ లైన్స్‌లో నిలుస్తూనే ఉంది. తాజాగా డ్యాన్స్ షోలో మోనాల్‌కు డ్యాన్స్ మాస్టర్ ముద్దివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం మోనాల్ ఓ డ్యాన్స్ షోకు మెంటర్‌గా పని చేస్తుంది. ఈ డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాస్టర్ కన్నా పట్టు వస్త్రాలతో వచ్చి సీట్లో ఉన్న మోనాల్‌ను స్టేజ్ పైకి తీసుకెళ్లి ఆమెకు రెడ్ రోజ్ ఇచ్చి చేతికి ముద్దు పెట్టాడు. ఇది చూసిన వారంతా షాక్ అయి నోరెళ్ల పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, మోనాల్ బిగ్ బాస్ షో నుండి అఖిల్‌తో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.