PG Building Collapse | ముగ్గురు మృతి.. తొమ్మిదిమందిని కాపాడిన అధికారులు..!
PG Building Collapse : ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని 'సత్య నికేతన్' (Satya Niketan) ప్రాంతంలోని బాలుర పీజీ భవనం(PG Building) కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, తొమ్మిదిమందిని రక్షించామని పోలీసులు తెలిపారు.
PG Building Collapse : ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని ‘సత్య నికేతన్’ (Satya Niketan) ప్రాంతంలోని బాలుర పీజీ భవనం(PG Building) కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, తొమ్మిదిమందిని రక్షించామని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని సౌత్వెస్ట్ అడిషనల్ డీసీపీ 1 అభిమన్యు పొస్వాల్() వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, తీవ్రంగా గాయపడిన వారికి జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన పీజీ భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సత్యనికేతన్ ప్రాంతంలోని ఐదంతస్తుల మేడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కుకుపోయారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులు ముగ్గురి మృత దేహాలను వెలికి తీశారు.
VIDEO | South Delhi building collapse: Additional DCP 1 (South West) Abhimanyu Poswal says, “Three people have died out of nine people that were rescued after a building collapsed in south Delhi’s Satya Niketan. Rescue operations are underway.”
(Full video available on PTI… pic.twitter.com/3mq7wHF5Ii
— Press Trust of India (@PTI_News) September 6, 2026
శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిదిమంది మందిని కాపాడామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సౌత్ వెస్ట్ అడిషనల్ డీసీపీ 1 అభిమన్యు పొస్వాల్ వెల్లడించారు. దుమ్మూధూళి కారణంగా శిథిలాల కింద ఉన్నవారికి ఆక్సిజన్ అందని పరిస్థితి. అందుకని ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించామని ఆయన వెల్లడించారు. ఇక ఈ దుర్ఘటన విషయం తెలియగానే సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేఖా గుప్త.. లోక్ నారాయణ్ ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
మధ్యాహ్నం 1:30 సమయంలో
ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్కు సమీపంలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఇరుకుగా ఉండే హాస్టల్ భవంతులు చాలానే ఉన్నాయి. వీటిలో.. 50 ఏళ్లకు పైబడిన ‘హాస్టల్ డేజ్’ భవంతి ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో కూలిపోయింది. బేస్మెంట్లో నిర్మాణ పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా బిల్డింగ్ పడిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు 1:33 గంటలకు అగ్నిమాపక కేంద్రానికి, సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. భవనంలో కుదుపు వచ్చిందని, ఏం జరుగుతుందో గ్రహించేలోపే కూలిపోయిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
VIDEO | South Delhi building collapse: Delhi Chief Minister Rekha Gupta arrives at Jai Prakash Narayan Apex Trauma Centre to meet the injured.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/kaJp5mo7l1
— Press Trust of India (@PTI_News) September 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

