Dava Vasantha Suresh | బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ : దావ వసంత సురేష్
Dava Vasantha Suresh | చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘ నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ నివాళులు అర్పించారు.
జగిత్యాల : చాకలి ఐలమ్మ ( Chakali Ailamma ) జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘ నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ (Dava Vasantha Suresh ) నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. బహుజనుల ఆత్మగౌరవానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకురాలని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు.
బట్టలకు పట్టిన మురికినే కాకుండా సమాజానికి పట్టిన మురికిని తొలగించే విధంగా పోరాటాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ భూమికోసం చాకలి ఐలమ్మ లాగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, సబ్బండ వర్గాలకు కేసీఆర్ శ్రీరామరక్ష అని వివరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగరాజం, వార్డు సభ్యులు రోజా విజయ్, నాయకులు లింగారెడ్డి, గంగారావు, గంగారెడ్డి, అబ్దుల్, అర్షిత్ రావు, రామ్మోహన్ రెడ్డి, రజక సంఘం నాయకులు లింగన్న, ప్రశాంత్, నారాయణ, గంగన్న, తిరుపతి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

