– సీడీపీవో కె.ఉమ
– రామలింగాపురం అంగన్వాడీ కేంద్రం సందర్శన
– చిన్నారుల తల్లిదండ్రులతో అంగన్వాడీ సేవలపై ఆరా
కారేపల్లి, సెప్టెంబర్ 26 : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి సెక్టార్లో గల రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్) అంగన్వాడీ కేంద్రాన్ని ఐసిడిఎస్ సీడీపీవో కె.ఉమ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాల అమలుతీరును పరిశీలించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో సూచించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం కేంద్రం నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి స్థానిక అంగన్వాడీ టీచర్ పుష్పలతకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రంలో చిన్నారులకు మెరుగైన సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్లు కృష్ణకుమారి, సత్య లీల ఉన్నారు.

‘ఐసీడీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి’