Srikanth Odela | నాని హీరోగా నటించిన చిత్రం ది ప్యారడైజ్ (The paradise) బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతున్న విషయం తెలిసిందే. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో మోహన్ బాబు విలన్గా నటించగా.. కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ది ప్యారడైజ్ను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాని అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా.. ప్రత్యేకించి ఈ సినిమాలో వచ్చే కేసీఆర్ పాత్ర శంకరన్నకు తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు.
శంకరన్న పాత్రలో టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి నటించిన తీరుకు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. సక్సెస్ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియదర్శి కేసీఆర్ మీద రీసెర్చ్ చేసి మరి శంకరన్న పాత్రను చేశాడట.
ఇదే విషయమై శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. శంకరన్న పాత్రకు ఎవరైతే బాగుంటుందని చాలా వెతికాం. ప్రియదర్శి కేసీఆర్ పాత్రకు పర్ఫెక్ట్గా ఉంటాడని ఏఐలో డిజైన్ చేసి నాకు చూపించాడు. ఆ తర్వాత నాకు చాలా నమ్మకమొచ్చింది. ప్రియదర్శి ఈ పాత్ర చేస్తడో.. లేదో..? ఏమంటడో తెలియదు అని నాకు భయముండేది. కానీ ప్రియదర్శిని కలిసి చెప్పినప్పుడు వెంటనే ఒకే చెప్పి.. కేసీఆర్ పాత్రకు సంబంధించిన రీసెర్చ్ ప్రియదర్శినే చేసుకొని శంకరన్న పాత్ర చేశాడని చెప్పుకొచ్చాడు.
ప్రియదర్శిని ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్ర చేయాలని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు
అతనే కేసీఆర్ మీద రీసెర్చ్ చేసి పాత్ర చేశాడు
– ది ప్యారడైజ్ మూవీ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ pic.twitter.com/tGL6aeduqh
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026