Fire Accident : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (Republic of Cango) లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లో జరిగిన పెళ్లి పార్టీ (Marriage party) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కాంగో రాజధాని (Cango capital) కిన్షాషా (Kinshasha) లో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్లో మంటలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరగడానికి కారణం ఏంటో తెలియరాలేదు’ అని అన్నారు.