e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌

మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌

మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌

ముంబై: ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్ర‌తిదానికీ ఓ యాప్ కామ‌నే కదా. ఇప్పుడు మీకు క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్ కూడా వ‌చ్చేసింది. అది కూడా కేవ‌లం మీ గొంతు విన‌డం ద్వారా చెప్పేస్తుందంటే న‌మ్ముతారా? ఆ యాప్ పేరు వోక‌లిస్‌చెక్ (VocalisCheck).

ఈ యాప్ ఎలా ప‌ని చేస్తుంది?
ఈ యాప్ సింపుల్‌గా మిమ్మ‌ల్ని 50 నుంచి 70 వ‌ర‌కు అంకెల‌ను గ‌ట్టిగా చ‌ద‌వ‌మ‌ని అడుగుతుంది. ఆ ఆడియో మీ మొబైల్‌లో రికార్డ్ అవుతుంది. ఈ ఆడియో మ్యాప్ కాస్తా స్పెక్ట్రోగ్రామ్‌గా మారుతుంది. ఇది హీట్ ఇమేజ్‌లాగా క‌నిపిస్తుంది. అప్పుడీ హీట్ మ్యాప్‌.. కొవిడ్ పేషెంట్ల ఆడియోతో పోల్చి మీకు ఫ‌లితాన్ని ఇస్తుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉప‌యోగించి ఇజ్రాయెల్‌కు చెందిన టెక్ కంపెనీ వోక‌లిస్ హెల్త్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

80 శాతం స‌క్సెస్‌
ఈ యాప్‌ను ఇండియాలోనూ ప‌రీక్షించి చూశారు. ఆస‌క్తిక‌రంగా ఇది 80 శాతం క‌చ్చితత్వంతో ప‌ని చేయ‌డం విశేషం. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ గ్రేట‌ర్ ముంబైతో క‌లిసి ఆ ఇజ్రాయెల్ కంపెనీ ఈ యాప్‌ను పరీక్షించి చూసింది. 2000 మంది పేషెంట్ల ఆడియోను హిందీ, ఇంగ్లిష్‌, మ‌రాఠీ, గుజ‌రాతీ భాష‌ల్లో రికార్డు చేసి ప‌రీక్షించింది. ఇందులో 81.2 శాతం స‌క్సెస్ రేట్ రావ‌డం విశేషం. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చాలా ఖ‌రీదైన‌ద‌ని, దాని స్థానంలో ఇలాంటి యాప్స్‌తో క‌రోనా ఉందో లేదో నిర్ధారించుకోవ‌డం చాలా ఈజీ అని వోక‌లిస్ హెల్త్ సంస్త కో ఫౌండ‌ర్ షేడీ హ‌స‌న్ అన్నారు.

గ‌ట్టిగా లెక్క‌బెడితే చాలు..
ఈ యాప్‌లో మీరు చేయాల్సిందిల్లా 50 నుంచి 70 వ‌ర‌కు అంకెలు గ‌ట్టిగా, స్ప‌ష్టంగా లెక్క‌బెట్ట‌డ‌మే. దీనిని క్లౌడ్ ఆధారిత అన‌లిటిక్స్‌లో వేస్తే చాలు.. కేవ‌లం రెండు నిమిషాల్లోనే ఫ‌లితం వ‌చ్చేస్తుంది. మొత్తంగా త‌మ డేటాబేస్‌లో ప‌ది ల‌క్ష‌ల వాయిస్ డేటాను ఉంచాల‌ని అనుకుంటున్న‌ట్లు సంస్థ చెబుతోంది. మాట్లాడే వ్య‌క్తి గ‌ళంలో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, త‌ల‌నొప్పి, జ్వ‌రంలాంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించి కొవిడ్ ఉందో లేదో ఈ యాప్ చెప్పేస్తుంది. మ‌న‌దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న ఈ స‌మ‌యంలో ఇలాంటి యాప్స్ బాగా ఉప‌యోగ‌ప‌డతాయి. అయితే ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ముందుగానే రిజిస్ట‌ర్ చేసుకున్న ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అటు ఐఓఎస్ యూజ‌ర్ల‌కు మాత్రం ఇది అనుకున్న స్థాయిలో ప‌ని చేయ‌డం లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి..

యురోపియ‌న్ క‌మిష‌న్‌ అధ్య‌క్షురాలికి ఘోర అవ‌మానం.. క‌నీసం కుర్చీ వేయ‌కుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న స‌ల్మాన్‌
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్క‌డ వ‌ద్దు.. మ‌హా సీఎంకు వాంఖ‌డే నివాసితుల లేఖ‌
భారత్ ప్ర‌యాణికుల‌పై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేప‌ట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారుల‌కు క‌రోనా
బంగ్లాదేశ్ టూర్‌కు ఆర్మీ చీఫ్
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
యూకేలో ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం
ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌
Advertisement
మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement