Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. అయితే, ప్రస్తుతం మహా ఎన్నికలకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభమై నాలుగు గంటలైనా 20 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. ఉదయం 11 గంటల వరకూ 18.14 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 31.37 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
31.37% voter turnout recorded till 11 am in the second and final phase of #JharkhandElection2024
18.14% recorded till 11 am in #MaharashtraElection2024 pic.twitter.com/5xVsp4RUEz
— ANI (@ANI) November 20, 2024
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Heavy Rain | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షం.. ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
Viral Video | అతిథులపై నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన పెళ్లివారు..VIDEO