న్యూఢిల్లీ, మార్చి 16: కమర్షియల్ వాహన ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్టు టాటా మోటర్స్ ప్రకటించింది. ఈ పెంపు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయం అధికం కావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా మాడళ్లు మరింత ప్రియంకానున్నాయి. ప్రస్తుతం సంస్థ యుటిలిటీ వాహనాలు, పికప్ ట్రక్కులు, బస్సులను తయారు చేసి, దేశీయంగా విక్రయిస్తున్నది.