Heavy Rain | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా తూత్తుకుడి, తిరునల్వేలి, తిరువావూరు, నాగపట్నం, కరైకల్ సహా పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు (Schools to remain closed) ప్రకటించింది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా.. రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాసి, తిరువారూరు జిల్లాల్లో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు కన్యాకుమారి జిల్లాలోని కన్యాకుమారి, పేచిపరై ప్రాంతాల్లోనూ విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. కరైకల్‌లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. తూత్తుకుడిలో మాత్రం కేవలం స్కూల్స్‌కు మాత్రమే సెలవు ఇచ్చారు. కళాశాలలు యథావిథిగా కొనసాగనున్నుయి. రానున్న ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు అలర్ట్ ప్రకటించింది.
Also Read..
Viral Video | అతిథులపై నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన పెళ్లివారు..VIDEO
Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించిన సర్కార్
Assembly elections | మహారాష్ట్రలో నెమ్మదిగా కొనసాగుతున్న పోలింగ్.. 9 గంటల వరకూ ఎంత శాతం అంటే..?