న్యూఢిల్లీ, మార్చి 16 : వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫినెటెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం లభించినప్పటికీ ఈ సంస్థ లిస్టింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మార్కెట్లో స్థిరత్వం వచ్చిన తర్వాతనే మళ్లీ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 16: బ్రీగ్రేడ్ గ్రూపునకు చెందిన వర్క్‌స్పేస్ సేవల సంస్థ బజ్‌వర్క్స్..హైదరాబాద్ మార్కెట్లో పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే లీజింగ్ స్థలాన్ని నిర్వహిస్తున్న సంస్థ..తాజాగా 550 సీట్ల సామర్థ్యం కలిగిన మరో ఆఫీస్ స్థలాన్ని మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్‌లో మొత్తం ఆఫీస్ లీజ్ స్థలం 1.1 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్టు కంపెనీ పేర్కొంది.