Bihar Elections | బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత (final phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 14.55 శాతం మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ఇక ఈ నెల 6న తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
14.55% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/AVpqkM6GZk
— ANI (@ANI) November 11, 2025
Also Read..
Delhi Blast: ఢిల్లీలో కారు పేలుడు.. యూఏపీఏ కింద కేసు నమోదు
Delhi Suicide Bomber: ఢిల్లీ సూసైడ్ బాంబర్.. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటో రిలీజ్
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. బరిలో 1302 మంది అభ్యర్థులు