సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్ర నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకుడు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే తిరుపతిలో ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
జయకృష్ణ, రషా తడానీలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ఐఎస్సీ, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: చందమామ కథలు.