నారాయణరావుపేట, మార్చి 6 : సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు శుక్రవారం మాచాపూర్ స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా పంటలకు నీళ్లు అందించాలని కోరారు. ధర్నాలో బంజేరుపల్లి సర్పంచ్ యాద భార్గవీ చందు తదితరులు పాల్గొన్నారు.