Birthright Citizenship | జన్మతః పౌరసత్వంపై ట్రంప్ పిడుగు.. ఇండియన్స్ పిల్లలకు ఇబ్బందులు
Birthright Citizenship | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డులపై ఎన్నో ఆంక్షలు పెడుతున్న ట్రంప్.. ఇప్పుడు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అమెరికాలో విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రాకుండా చేయడమే.
Birthright Citizenship | న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డులపై ఎన్నో ఆంక్షలు పెడుతున్న ట్రంప్.. ఇప్పుడు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అమెరికాలో విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రాకుండా చేయడమే. అమెరికాలో పుట్టిన వారందరినీ అమెరికన్లుగానే పరిగణించాలని యూఎస్ సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునిచ్చిన క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి మరికొన్ని మార్పులు చేస్తున్నామని చెప్పారు.
1986లో అమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. విదేశీయులు అమెరికాకు వచ్చి జన్మనిస్తే వారి పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం దక్కుతుంది. దీన్ని నియంత్రించాలని ట్రంప్ చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఉత్తర్వుల వల్ల భారతీయుల పిల్లలు అమెరికా పౌరసత్వం పొందడం చాలా కష్టతరం అయ్యేలా ఉంది. ప్రతి ఏటా భారతీయుల పిల్లలు 2.5 లక్షల మంది అమెరికాలో జన్మిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ పౌరసత్వం విషయంలో ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
విదేశీ జర్నలిస్టు వీసాలపై కొత్త రూల్
యూఎస్‌లో పనిచేయడానికి వీసాల కోసం ఐప్లె చేసుకునే విదేశీ జర్నలిస్టులకు ట్రంప్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ తెలిపింది. ట్రంప్ రూల్ ప్రకారం అమెరికా వీసా కావాలనుకునేవారు కచ్చితంగా వారి సోషల్ మీడియా ఖాతాలను వెల్లడించాల్సిందే. ఇప్పుడు ఈ రూల్‌ను అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా విస్తరించనున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. విదేశీ జర్నలిస్టులు యూఎస్ వీసాకు అర్హులా కాదా అనే విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకున్న తర్వాతే జారీ చేస్తామని ఇది అత్యంత కీలకమని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

