ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 08:03:16

బెంగాల్‌లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

బెంగాల్‌లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకరణ ఘటన జల్పాయిగుడి జిల్లా ధుప్‌గుడి వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారని స్థానిక ఎమ్మెల్యే మిథాలీ రాయ్‌ తెలిపారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఓవర్‌లోడ్‌, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.VIDEOS

logo