Heatwave | ఉత్తరాదిన భానుడి ప్రతాపం.. వడదెబ్బ కారణంగా 12 మంది మృతి
Heatwave | దేశవ్యాప్తంగా భనుడు ప్రతాపం చూపిస్తున్నాడు (Heatwave). చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది.
Heatwave | దేశవ్యాప్తంగా భనుడు ప్రతాపం చూపిస్తున్నాడు (Heatwave). చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యుడు భగభగ మండుతున్నాడు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కనీసం 16 ప్రాంతాల్లో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. ఈ వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఇక ఎడారి రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan)లో గురువారం గరిష్ఠంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన వడగాల్పులకు రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో వడదెబ్బ తగిలి ఏకంగా 12 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. జలోర్‌లో నలుగురు, బార్మర్‌లో ఇద్దరు మరణించారు. అల్వార్, భిల్వారా, బలోత్రా, జైసల్మేర్‌లలో తీవ్రమైన వేడిగాలులు ప్రజల ప్రాణాలను బలితీసుకున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బకు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే అనుమానాస్పదంగా మృతి చెందిన కొందరిలో వడదెబ్బ లక్షణాలు కనిపించాయన్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో హీట్‌వేవ్స్ కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాజస్థాన్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు హీట్‌వేవ్స్ కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూలోని కొన్ని ఏరియాల్లో హీట్‌వేవ్స్ కొనసాగనున్నట్లు ఐఎండీ పేర్కొంది.
ఉత్తర భారతదేశం (North India) వడగాలులకు అల్లాడిపోతుండగా.. దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలో గురువారం భారీ వర్షం పడింది. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్ సహా పలు ప్రధాన నగరాలు జలమయమయ్యాయి. ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయ్యింది. అదేవిధంగా పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Also Read..
SUV | కారును రివర్స్ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Siddaramaiah | ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించి ఉంటాడు.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

