‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) కు దూరంగా ఉండాలని రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి.జగదీశ్ అన్నారు. శనివారం మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల...
రామన్నపేట, అక్టోబర్ 31 : యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) కు దూరంగా ఉండాలని రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి.జగదీశ్ అన్నారు. శనివారం మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. విద్యార్థులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాజంలో దీనిపై అవగాహన కల్పిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు సాగిన ఈ మినీ మారథాన్‌లో ఎన్.ఎస్.ఎస్ (NSS) విద్యార్థులు, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు అశోక్ కుమార్, అశోక్ రెడ్డి, కళాశాల అధ్యాపక సిబ్బంది ప్రసూన దేవి, పున్నారావు, మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, నిర్మల, కవిత, నరసింహ రావు, రాజేశ్వరి, శ్రీకాంత్, నగేష్, కరుణ, మారాణి, నాగమణి, పరుశురాములు, శ్రవణ్, నర్సయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- drugs
- ramannapet
- Yadadri news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

