Siddaramaiah | ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించి ఉంటాడు.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ
Siddaramaiah | కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో మాజీ ప్రధాని దేవెగౌడపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
Siddaramaiah | లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) సెక్స్ స్కాండ్ కేసు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో ప్రజ్వల్ జర్మనీ పారిపోవడానికి దేవెగౌడ సాయం చేశారని ఆరోపించారు. ‘దేవెగౌడ స్వయంగా ప్రజ్వల్‌ను విదేశాలకు పంపి ఉంటారని నేను అనుకుంటున్నాను’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
మరోవైపు వేధింపుల ఆరోపణల తర్వాత దౌత్య పాస్‌పోర్ట్‌పై విదేశాలకు పారిపోయిన మనవడు ప్రజ్వల్‌కు దేవెగౌడ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తన సహనాన్ని పరీక్షించొద్దని, భారత్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని స్పష్టంచేశారు. తన మాటల్ని లెక్కచేయకపోతే తనతోపాటు కుటుంబ సభ్యులందరి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ప్రజ్వల్ రేవణ్ణకు ఇదే నా హెచ్చరిక’ పేరుతో ‘ఎక్స్’లో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఈ లేఖపై స్పందించిన సిద్ధరామయ్య పై విధంగా వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను విదేశాలకు పారిపోయాడు. పోలీసులు ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. దీంతో వారం రోజుల్లో భారత్‌కు వస్తానని ప్రజ్వల్ ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే, ఇప్పటి వరకూ అతడు భారత్‌కు తిరిగిరాలేదు. దీంతో ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే న్యాయస్థానం అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిందని, ఈ క్రమంలో వెంటనే అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.
Also Read..
Swati Maliwal | ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మలివాల్
Landslide | ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి
Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

