Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి గోల్డెన్ వీసా (UAE Golden Visa) అందుకున్నారు.
Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి గోల్డెన్ వీసా (UAE Golden Visa) అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సూపర్ స్టార్ సంతోషం వ్యక్తం చేశారు. యూఏఈ గోల్డెన్ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, కల్చర్, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివసించే వీలు ఉంటుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది. ఈ వీసాలకు 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అవే రెన్యువల్ అవుతాయి. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.
ఇక యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డెన్ వీసాను భారత్ నుంచి సినీ ప్రముఖుల్లో మొదటగా షారుఖ్‌ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ , నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్ ఈ వీసాను పొందారు. ఈ వీసాను అందుకున్న తొలి తమిళ కథానాయికగా త్రిష రికార్డుకెక్కింది. ఆమె తర్వాత అమలాపాల్ ఈ వీసాను పొందింది. మలయాళ ఇండస్ట్రీ విషయానికొస్తే మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా ఉపాసన నిలిచారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు కూడా ఈ వీసా వరించింది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
Also Read..
Shadnagar | ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ వాసి అనుమానాస్పద మృతి
Kedarnath: కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

