Shadnagar | ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ వాసి అనుమానాస్పద మృతి
Shadnagar | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ బీజేపీ నాయకుడు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు.
Shadnagar | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్ బీజేపీ నాయకుడు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిన అరవింద్.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అరవింద్ డెడ్‌బాడీ సముద్రంలో లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహం అరవింద్‌దేనని పోలీసులు ధ్రువీకరించారు. అతడిది హత్యా..? లేక ఆత్మహత్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గత సోమవారం షాద్‌నగర్‌కు వచ్చేందుకు అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. వారం రోజుల క్రితమే అరవింద్ తల్లి ఉషారాణి ఆస్ట్రేలియా నుంచి సొంతూరికి వచ్చింది. అరవింద్ భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరకు సముద్రంలో శవమై తేలాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

