పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
Man uses sanitary napkin for Exam cheating | ఒక వ్యక్తి పరీక్షలో చీటింగ్‌కు పాల్పడ్డాడు. శానిటరీ నాప్కిన్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉంచాడు. దానిని లోదుస్తుల్లో దాచాడు. ఆ పరికరం నుంచి శబ్దాన్ని గమనించిన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థిని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
లక్నో: ఒక వ్యక్తి పరీక్షలో చీటింగ్‌కు పాల్పడ్డాడు. శానిటరీ నాప్కిన్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉంచాడు. దానిని లోదుస్తుల్లో దాచాడు. ఆ పరికరం నుంచి శబ్దాన్ని గమనించిన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థిని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. (Man uses sanitary napkin for Exam cheating) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (పీఈటీ) నిర్వహించారు. నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలేజీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఒక అభ్యర్థి పరీక్ష రాశాడు.
కాగా, ఆ అభ్యర్థి నుంచి ఒక శబ్దం రావడాన్ని ఇన్విజిలేటర్ గమనించారు. అతడ్ని తనిఖీ చేయగా ఒక ఎలక్ట్రానిక్ పరికరం లభించింది. ఆ పరికరాన్ని ఒక శానిటరీ ప్యాడ్‌లో దాచి తన లోదుస్తులలో పెట్టుకున్నట్లు గ్రహించారు. ఆ అభ్యర్థిని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆకాష్ పటేల్‌గా గుర్తించారు. పరీక్షలో మోసానికి పాల్పడేందుకు ఆ పరికరాన్ని అతడు ఉపయోగించినట్లు అనుమానించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ పరికరాన్ని, దానికి సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి ఆకాష్ పటేల్‌పై ఎగ్జామ్ మోసానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Ashutosh Dixit | ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతల స్వీకారం
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

