SUV | కారును రివర్స్ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
SUV | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఎస్యూవీ (SUV) కారుని రివర్స్ చేస్తూ చూసుకోకుండా ఓ వృద్ధుడిపైకి ఎక్కించాడు.
SUV | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఎస్యూవీ (SUV) కారుని రివర్స్ చేస్తూ చూసుకోకుండా ఓ వృద్ధుడిపైకి ఎక్కించాడు. ఈ ఘటనలో ఆ వృద్ధుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూపీలోని ఝాన్సీ (Jhansi) ప్రాంతంలోగల రద్దీగా ఉండే సిప్రి బజార్ (Sipri Bazaar)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఇరుకైన వీధిలో ఓ వ్యక్తి తన టొయోటా ఫార్చూనర్ కారును రివర్స్ చేస్తున్నాడు. అప్పటికే అక్కడ రోడ్డుకు ఇరువైపులా రెండు కార్లు ఆగి ఉన్నాయి. వాటి మధ్యలోంచి కారును రివర్స్ చేస్తున్నాడు. అదే సమయంలో రాజేంద్ర గుప్తా (Rajendra Gupta) అనే 70 ఏళ్ల వృద్ధుడు అటుగా వెళ్తున్నాడు. ఇది గమనించిన డ్రైవర్ కారును అలాగే వెనక్కి నడుపుతూ వృద్ధుడిని ఢీ కొట్టాడు. దీంతో అతడు కిందపడిపోయాడు. వృద్ధుడిని గమనించని డ్రైవర్ కారును అతడిపై నుంచి అలానే వెనక్కి పోనిచ్చాడు.
కొంత దూరం వరకూ వృద్ధుడిని కారుతో లాక్కెళ్లాడు. అనంతరం కారును ఆపి మళ్లీ ముందుకు నడిపి మరోసారి వృద్ధుడిపైకి ఎక్కించాడు. ఈ ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోతూ గట్టిగా కేకలు వేశాడు. అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కారు కింద నలిగిపోతున్న రాజేంద్ర గుప్తాని బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
झांसी में दिल दहला देने वाला वीडियो आया सामने
कार के पीछे खड़े व्यक्ति को कार ने कुचला
पूरी घटना सीसीटीवी कैमरे में हुई कैद
सीपरी बाजार थाना क्षेत्र की बताई जा रही घटना#Jhansi | @jhansipolice #UttarPradesh pic.twitter.com/GI50GOGeAL— Abhitosh Singh अभितोष सिंह 🇮🇳 (@abhitoshsingh) May 24, 2024
Also Read..
Siddaramaiah | ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించి ఉంటాడు.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ
Swati Maliwal | ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మలివాల్
Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

