Akshata Murty | త్వరలో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు.. ప్రతి అడుగులోనూ నీ వెంటే అంటూ అక్షతా మూర్తి స్పెషల్ పోస్ట్
Akshata Murty | జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి (Akshata Murty) సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Akshata Murty | జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో (UK general election) అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) బుధవారం ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి (Akshata Murty) సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘నీ ప్రయాణంలో వేసే ప్రతి అడుగులో నేను నీ వెంటే ఉంటా..’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు భర్త రిషి సునాక్‌తో దిగిన పొటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ ఎన్నికల డేట్స్‌ను రిషి సునాక్ ప్రకటించారు. బుధవారం ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద వర్షంలో తడుస్తూనే ఆయన ఈ ప్రకటన చేశారు. ‘బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. దేశాధినేత కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడాను. పార్లమెంట్‌ను రద్దు చేయమని అభ్యర్థించాను. ఇందుకు రాజు కూడా అనుమతించారు. జూలై 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి’ అని రిషి సునాక్ వెల్లడించారు.
Also Read..
SUV | కారును రివర్స్ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Siddaramaiah | ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించి ఉంటాడు.. సిద్ధరామయ్య సంచలన ఆరోపణ
Swati Maliwal | ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మలివాల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

