Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 8న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించ నుందని టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న దీపావళి ఆస్థానాన్ని ( Deepavali Asthanam) టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించ నుందని అధికారులు వివరించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని తెలిపారు.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా, సేనాధిపతి శ్రీ విష్వక్సేనల వారు స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారని వెల్లడించారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించడంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుందన్నారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబర్ 8న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసి, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

