Pocso Case | బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు.. పోలీసులు వదిలేయడం వల్లే..!
Pocso Case | షాబాద్లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పోలీసులు మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోక్సో కేసు నిందితుడు బాలికను ఎత్తుకెళ్లాడు.
Pocso Case | షాబాద్లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితుడికి వత్తాసు పలకడం వల్లే ఈ దారుణం జరిగిందని తేలింది. కాగా ఈ ఘటన మరువక ముందే పోలీసులు మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేయడం కలకలం రేపుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పోక్సో కేసు నిందితుడు బాలికను ఎత్తుకెళ్లాడు. జిల్లాలోని అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలెంల చైతన్య అనే నిందితుడు ఈ నెల 9వ తారీఖున మైనర్ బాలిక ఇంట్లోకి గోడ దూకి వచ్చి అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు పెట్టి రిమాండ్ చేయకుండా వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. అడ్డగూడూర్ ఎస్ఐ వెంకటరెడ్డి నిందితుడు చైతన్యను వదిలేయడంతోనే అతడు బాలికను కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
Read ALso :
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

