యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు(Aleru) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సాజుద్దీన్(23), నితిన్‌రెడ్డి(28 )అనే వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ నుంచి జనగామ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆలేరుకు చేరుకోగానే కారు వెనక నుంచి వారి బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు జనగామ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ritu Chowdary | బిగ్ బాస్ ఫేం రీతూ చౌదరి పెళ్లి, బ్రేకప్‌పై ఓపెన్ … “రిలేషన్షిప్ ఒక మెంటల్ టార్చర్”