Ritu Chowdary |బిగ్ బాస్ తెలుగు షో ద్వారా ప్రేక్షకులకు అలరించిన రీతూ చౌదరి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ప్రేమ వ్యవహారాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అభిమానులు చాలా రోజులుగా ఆమె పెళ్లి, బ్రేకప్ మరియు లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆమె వివరించిన అంశాలు ప్రేక్షకులకు కొత్త క్లారిటీని ఇచ్చాయి. రీతూ గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని తనకు కాబోయే భర్తగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.ఈ కాబోయే వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించాయి.
అయితే రీతూ తాజాగా నేను, శ్రీకాంత్ ఏడాది పాటు రిలేషన్లో ఉన్నాము. “నా మెంటాలిటీ అతని మెంటాలిటీ సెట్ కాలేదు. దాన్ని పెళ్లి అని నేను అనుకోను,” అని ఆమె చెప్పారు. బ్రేకప్ కారణాలు వ్యక్తిగతమైనవి, అందువల్ల ఆమె దానిపై స్పష్టంగా చెప్పలేను అని పేర్కొన్నారు.రీతూ తన లైఫ్‌లో సింగిల్‌గా ఉండడంలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉంటా. మా నాన్న లాంటి వారు దొరికితే ఆలోచిస్తా అని ఆమె తెలిపారు. రిలేషన్షిప్ ఒక మెంటల్ టార్చర్, డిప్రెషన్, టాక్సిక్ ట్రామా అని ఆమె భావనను పంచుకున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో డీమాన్ పవన్ ,రీతూ మధ్య ఎమోషన్స్ హాట్ టాపిక్‌గా మారడం మనం చూశాం. అయితే షో తరువాత కూడా రీతూ-పవన్ మధ్య రిలేషన్ కొనసాగుతుందన్న అనుమానాలు ఉన్నా, దీనిపై క్లారిటీ లేదు. రీతూ చౌదరి వ్యక్తిగత జీవితంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం, సంబంధాలను గురించి నిజాయితీగా మాట్లాడడం అభిమానులకు అవగాహన కలిగించింది. జబర్ధస్త్‌తో జనాలని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బిగ్ బాస్ షోతో అందరికి దగ్గరైంది.