Veera Bhadra Swamy Temple | రాయపోల్, ఫిబ్రవరి 25: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, పుణ్యవచనం, మాతృకా, అంకురార్పణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
గురువారం ఉదయం అన్నపూజ, ఆకుల పూజ, సాయంత్రం ఉమామహేశ్వరుల కల్యాణోత్సవం, రాత్రి సుంకు భద్రకాళి ఆవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక శుక్రవారం ఉదయం అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహించి, స్వామి వారిని ఉత్సవ రథంపై ఊరేగిస్తారు.
వీరభద్రుడి ఉత్సవాలకు వడ్డేపల్లితో పాటు రాయపోల్ మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, దొడ్లపల్లి, సయ్యద్ నగర్,బేగంపేట, రామారం తదితర గ్రామాలతో పాటు, దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.