Bhogi | భోగి ఫస్ట్ లుక్ రిలీజ్… గంగాగా శర్వానంద్ ఇంటెన్స్ లుక్ అదిరింది..!
Bhogi | టాలీవుడ్లో వరుస ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం భోగి. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. గంగ అనే పాత్రలో శర్వానంద్ కనిపించిన తీరు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Bhogi | టాలీవుడ్లో వరుస ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం భోగి. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. గంగ అనే పాత్రలో శర్వానంద్ కనిపించిన తీరు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్లో శర్వానంద్ గుబురు మీసంతో, చేతిలో పదునైన ఆయుధంతో కనిపిస్తున్నాడు. అతని కళ్లలో కనిపించే తీవ్రత, బాడీలో ఉన్న రఫ్‌నెస్ సినిమా టోన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే ఇది పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక చిత్రబృందం భోగి విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 28, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించింది. అదే వారం ముందుగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్ విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననుంది. రెండు భారీ చిత్రాలు వరుసగా విడుదలవుతుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రోహిత్ పాఠక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాత్రల ప్రాధాన్యత ఎక్కువగా ఉండబోతుందని సమాచారం.
భోగి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు రేకెత్తించిన భోగి చిత్రం నుంచి త్వరలోనే టీజర్, ట్రైలర్ తదితర అప్డేట్స్ రానున్నాయని సమాచారం.వాటి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శర్వానంద్ కొత్త అవతారం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

