Couple | ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లాకు చెందిన సింహాచలం-భవానీ దంపతులు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే నవదంపతుల మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటనకు ముందు రైల్లో దంపతుల మధ్య గొడవ జరిగినట్టు ప్రయాణికులు తీసిన వీడియో దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదా..? ఉద్దేశపూర్వకంగా భార్యాభర్తలు దూకేశారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోని పార్వతీపురం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కి అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరు హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్లో నివాసముంటున్నారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది.
శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
Pilot Attack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా