Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
తండ్రికి పెద్ద మొత్తంలో బీమా (Insurance) చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు (Snake Bite). ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ (Insurance Claim) చేసుకుందామని అనుకున్నారు. అయితే వారిపై బీమా సంస్థ అధికారికి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది.
చెన్నై: తండ్రికి పెద్ద మొత్తంలో బీమా (Insurance) చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు (Snake Bite). ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ (Insurance Claim) చేసుకుందామని అనుకున్నారు. అయితే వారిపై బీమా సంస్థ అధికారికి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. కాసుల కక్కుర్తితో కన్నతండ్రినే కుమారులు చంపేశారని తేలింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది.
తిరువళ్లూరు జిల్లా తిరుత్తని సమీపంలోని పొదట్టూర్పెట్టయ్కి చెందిన గణేశన్ (56).. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా (Lab Assistant) పనిచేస్తున్నారు. అక్టోబర్ 22న తన నివాసంలో పాముకాటుతో చనిపోయారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం అతడి ఇద్దరు కుమారులు ఇన్సూరెన్స్ కంపెనీనీ ఆశ్రయించారు. దీంతో వారికి అనుమానం రావడంతో విచారణ జరిపారు. గణేశన్పై అధిక విలువ గల అనేక పాలసీలు ఉండడం, తండ్రి మరణించి వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేశన్ కుమారులు మోహన్‌రాజ్ (26), హరిహరన్ (27) ప్రైవేట్ ఉద్యోగులు. ఆన్లైన్ బెట్టింగ్‌లు ఆడి నష్టపోయారు. దీంతో అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్న అన్నదమ్ములు.. పథకం ప్రకారం తండ్రి పేరుపై రూ.3 కోట్ల బీమా చేయించారు. అనంతరం ప్రమాదవశాత్తూ తమ తండ్రి చనిపోయినట్లు నమ్మించడానికి పాము కాటుతో చంపాలని కుట్ర పన్నారు.
ప్లాన్ ప్రకారం స్నేహితుల సహాయంతో ఒక పామును తమ తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన పక్కన వదిలారు. అది కాలుపై కరవడంతో ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు దవాఖానకు తరలించిం రక్షించారు. తమ ప్రయత్నం ఫలింకపోవడంతో వారం రోజుల తర్వాత మరో అత్యంత విషపూరితమైన పామును తీసుకువచ్చి.. గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతడి మెడపై కాటు వేయించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు పామును అక్కడే చంపేశారు. అయితే అతడిని దవాఖానకు తరలించే విషయంలో నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారితోపాటు వాళ్లకు సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

