న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఓ ప్రయాణికుడిపై పైలట్ దాడి(Pilot Attack) చేశాడు. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఆ పైలట్‌ను సస్పెండ్ చేసింది. ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నది. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఘటన పట్ల క్షమాపణ కోరుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నది. మరో విమానంలో ఓ ప్రయాణికుడిగా తమ పైలట్ ప్రయాణిస్తున్న సమయంలో దాడి ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. పైలట్ ప్రవర్తనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నది. అయితే తక్షణమే సంబంధిత వ్యక్తిని అధికారిక విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆ సంస్థ తన పోస్టులో వెల్లడించింది. దర్యాప్తు తర్వాత సరైన చర్యలు తీసుకుంటామన్నారు.
పైలట్ తనపై దాడి చేసినట్లు ప్రయాణికుడు తన సోషల్ మీడియాలో పోస్టులో రాశాడు. రక్తం నిండిన ముఖం ఫోటోను అతను ఆ పోస్టుకు జత చేశాడు. పైలట్ ఫోటో కూడా పోస్టు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంకిత్ దివాన్ అనే వ్యక్తి స్పైస్‌జెట్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేశాడు. కెప్టెన్ వీరేందర్ సెజ్వాల్ బోర్డింగ్ క్యూలైన్ వద్ద మధ్యలో దూరాడని, దాన్ని అడ్డుకోవడంతో అతను దాడి చేసినట్లు దివాన్ పేర్కొన్నారు. సెక్యూర్టీ చెక్ లైన్లో ఈ ఘటన జరిగినట్లు అతను చెప్పాడు.
@ankitdewan We profoundly regret this incident at Delhi Airport, involving one of our employees who was traveling as a passenger on another airline. We extend our heartfelt empathy for the distress it has caused, and strongly condemn such behaviour. The concerned employee has…
— Air India Express (@AirIndiaX) December 19, 2025