Yadadri Temple | యాదగిరిగుట్ట, మార్చి3: యాదగిరిగుట్ట స్వామివారి వార్షిక బహ్మోత్సవాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ ప్రాంతానికి చెందిన సింధు యక్షగాన, కోలాట బృందాలతోపాటు బాగోతం, భజన, డప్పుడోలు హరికథలు, పంబాల కళాకారులకు అవకాశం కల్పించాలని ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేశ్ డిమాండ్ చేశారు.
ఇవాళ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ప్రజానాట్య మండలి నియోజకవర్గస్థాయి సమావేశంలో చెక్క వెంకటేశ్ పాల్గొని మాట్లాడారు. యక్షగాన, కోలాట బృందాల విషయమై పలు మార్లు దేవస్థాన ఈవోకు రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా గుర్తించి వీరికి సాంస్కృతిక కార్యక్రమాలలో అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షురాలు ఇంజ హేమలత, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్లెం కృష్ణ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండి జంగమ్మ, రైతు సంఘం నాయకులు పేరబోయిన బంగారి తదితరులు పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు