యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దొండ కొమురయ్య (58) తన పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఆదివారం ఉదయం మృతి చెందారు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా స్విచ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాకు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొమురయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Bab el-Mandeb | తర్వాతి టార్గెట్ బాబ్ ఎల్-మండేబ్?.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సంకేతాలు
Patriot | ఒకే స్క్రీన్‌పై మమ్ముట్టి, మోహన్‌లాల్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘పేట్రియాట్’ ట్రైలర్!
Nirmal | నిర్మల్ జిల్లాలో విషాదం.. ఫ్రిడ్జి పేలి ఇద్దరు మృతి