Couple | పెళ్లైన నవ దంపతులను రైలు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కి అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరు హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్లో నివాసముంటున్నారు.
సింహాచలం, భవానీ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్దున్న దంపతులిద్దరూ ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులిద్దరు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.
శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
Pilot Attack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా