Yadadri Laxmi Narasimha Swamy | యాదగిరిగుట్ట, మార్చి9 : స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కల్యాణానికి రాష్త్ర మంత్రులు రాకపోవడం స్వామివారిని అవమాన పరచడమేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆరోపించారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో యాదగిరిగుట్ట స్వామి వారికి తీవ్ర అవమానం జరుగుతుందని అన్నారు. గుట్ట అభివృద్ధికి ఒక్కపైసా నిధులు కేటాయించపోగా.. స్వామి ఉత్సవాలలో అవమాన పరిచే విధంగా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కర్ రావు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
శనివారం జరిగిన తిరు కళ్యానోత్సవం లో ప్రభుత్వం తరపున అందజేసే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పణలో బీర్ల శంకర్, ఈరసారపు యాదగిరిగౌడ్ ఏ హోదాలో పాల్గొన్నారో చెప్పాలన్నారు. ప్రతీ సారి పట్టువస్త్రాలు స్వామి వారికీ సమర్పించే క్రమంలో మండపంపై కాకుండా అర్చకులు కిందికి దిగి స్వీకరిస్తారని అన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా స్వామి వారి మండపాన్ని ఎక్కి ఇవ్వడం పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉందన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇతర జిల్లా మంత్రులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక నిర్వహించే వారని అన్నారు. కానీ ఈసారి కళ్యాణం మాత్రం మంత్రులు లేకుండా జరిగిందని ఇది స్వామివారిని అవమానించడమే నని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, పాల సంఘం చైర్మన్ మారెడ్డి కొండల్ రెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుణగంటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్