Collector Hanumantha Rao| ఆలేరు టౌన్, మార్చి 1 : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలేరు మండలంలోని జిల్లా పరిషత్ స్కూల్స్‌ను ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలను కలెక్టర్ హనుమంతరావు విడుదల చేశారు.
ఈ టాలెంట్ టెస్ట్ లో వివిధ స్కూల్స్ నుండి పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులలో తమ ప్రతిభను కనపర్చి.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.
విద్యార్థుల మేధస్సు, ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న టాలెంట్ టెస్ట్ నిర్వాహక బృందాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుంతవత్ కమలాకర్, మైదం భాస్కర్, ఆలేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టాలెంట్ టెస్ట్ విజేతలు..
ప్రథమ బహుమతి : అలుగల ఆర్యన్
ద్వితీయ బహుమతి : పిన్నింటి రాంచరణ్ రెడ్డి,
తృతీయ బహుమతి : చిట్టొజు సాయి ప్రసన్న
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు