BB Nagar Dumping Yard | బీబీనగర్, మార్చి 6 : ఎయిమ్స్ బయో మెడికల్ వ్యర్ధాలను బీబీనగర్ గ్రామ జనావాసాల మధ్య డంపింగ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ పట్టణ అధ్యక్షుడు గోలి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ తరలించాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిట్టల అశోక్ మాట్లాడుతూ.. పీర్లగుట్ట వద్ద డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తను నిర్దేశిత స్థలంలో కాకుండా అనుమతులు లేని పోచంపల్లి రోడ్డులో జనావాసాల మధ్య ఉన్న తెచ్చి పోస్తున్నారని అన్నారు. అధికారులు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఇండ్ల మధ్యలో చెత్తను పోయడం సరికాదన్నారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, పొగతో లేప్రసి కాలనీ వాసుల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. బీబీనగర్ పెద్ద చెరువు ఆవరణలో లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డ్‌ను ఎందుకు వినియోగంలోకి తీసుకువస్తలేరని అధికారులను ప్రశ్నించారు.
బీబీనగర్ గ్రామానికి సంబంధించిన వ్యర్థాలు, ఎయిమ్స్ హాస్పిటల్ నుండి వస్తున్న బయో మెడికల్ వేస్ట్ ను పీర్ల గుట్ట వద్ద డంప్ చేసి కాల్చి వేస్తున్నారన్నారు . దీంతో ఏర్పడిన విషవాయువులను పీల్చుకొని బీబీనగర్ గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని అన్నారు. ఎయిమ్స్ వ్యర్ధాల వలన ప్రమాదకరమైన అంటువ్యాధులు ప్రబలుతాయని.. ప్రజలు రేడియేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎయిమ్స్ దవాఖాన పారిశుద్ధ్యం బీబీనగర్ గ్రామపంచాయతీకి సంబంధం లేని విషయమని అధికారులు ఎందుకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అధికారులను ప్రశ్నించారు.
జనవాసాలకు దూరంగా డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరకొండ శ్రీనివాస్ పంజాల మహేష్ గౌడ్ , వంగరి పరంకుశం, మహమ్మద్ కుతుబుద్దీన్, పొట్ట శ్రీనివాస్, పంజాల ఈశ్వర్ గౌడ్, అశోక్ చారి, సున్నం రాజు, జాడ సంతోష్, రాంపల్లి కుమార్, బర్ల వెంకటేష్, మర్రి శ్రీకాంత్, పొట్ట శ్రీనివాస్, రామ్, తదితరులు పాల్గొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు